కొందరి వల్లే సిలికాన్ వ్యాలీ బ్యాంకుకు సమస్యలు : డిమన్
ఒక వేళ మరిన్ని బ్యాంకులు విఫలమైనా, అమెరికా బ్యాంకింగ్ సంక్షోభం ముగింపునకు వచ్చినట్లే భావించాలని జేపీమోర్గాన్ చేజ్ అండ్ కో సీఈవో జేమీ డిమన్ తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో ఒక వేళ ఏమైనా జరిగినా వాటికి పరిష్కారం లభిస్తుంది. అవే వైఫల్యం చెందే చివరి బ్యాంకులు కావొచ్చు అని డిమన్ అన్నారు. బ్యాంకింగ్ సంక్షోభం ముగింపునకు చేరినట్లేనని భావిస్తున్నానన్నారు. 2005 నుంచి జేపీమోర్గాన్ సీఈవోగా డిమన్ ఉన్నారు. 2008 ఆర్థిక సంక్షోభానికి ముందు నుంచి, ఇప్పటిదాకా ఒక పెద్ద బ్యాంకుకు అధిపతిగా ఉన్న ఏకైక వ్యక్తి ఈయనే కావొచ్చు. బ్యాంకింగ్ పరిశ్రమలో ఇటీవల ఒడుదొడుకుల వల్ల అమెరికాలో మాంధ్యం భయాలు కనిపించాయి. అయితే మాంధ్యం ఏర్పడక పోవచ్చని డిమన్ అంచనా వేశారు. కొందరి వల్లే సిలికాన్ వ్యాలీ బ్యాంకుకు సమస్యలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థల త్రైమాసిక ఫలితాలు వెల్లడి వచ్చే వారం ప్రారంభం కానుందని, అవి మెరుగ్గా ఉండొచ్చనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.






