ట్విటర్ కు పోటీ వచ్చేసింది……. బ్లూస్కై
ట్విటర్ సహవ్యవస్థాపకుడు, మాజీ సీఈవో జాక్ డోర్సే తన కొత్త సామాజిక మాధ్యమాన్ని పరిచయం చేశారు. కొత్త సోషల్ మీడియా ప్లాట్ ఫాం బ్లూస్కై బీటా వర్షెన్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఇది యాపిల్ యాప్ స్టోర్ లో ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అథెంటికేటెడ్ ట్రాన్స్ఫర్ ప్రొటోకాల్‌పై ఆధారపడి ఇది పనిచేస్తుంది. అంటే కేవలం ఒక సైట్ ద్వారా మాత్రమే కాకుండా పలు సైట్ల ద్వారా ఇది పనిచేస్తుందన్నమాట. యాప్ ఇంటెలిజెన్స్ సంస్థ అందించిన వివరాల ప్రకారం ఐవోఎస్ యాప్ స్టోర్‌లో బ్లూస్కై ఫిబ్రవరి 17నే అందుబాటులోకి వచ్చింది. ఇక ఇది వచ్చినప్పటినుంచి టెస్టింగ్ దశలోనే 2,000 మంది వరకు ఇన్స్టాల్ చేసుకున్నారు. దీని యూజర్ ఇంటర్ఫేజ్ డిజైన్ చాలా సింపుల్‌గా ఉంది. యాప్‌లో ఉండే ప్లస్ బటన్‌ను క్లిక్ చేసి 256 క్యారెక్టర్లతో పోస్ట్‌ను క్రియేట్ చేసేలా దీనిని డిజైన్ చేశారు. ఫొటోస్‌తో కూడా పోస్ట్ చేసుకోవచ్చు. ట్విట్టర్ పోస్ట్ బాక్స్‌లో అని ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే బ్లూస్కై లో మాత్రం గా కనిపించనుంది. ఇందులో షేర్, మ్యూట్, బ్లాక్ అకౌంట్స్ వంటి ఫీచర్లు సైతం ఉన్నట్లు సంస్థ పేర్కొంది.






