ఇన్‌స్టాగ్రామ్ లో మరో కొత్త ఫీచర్… మూడ్‌కు తగ్గట్లుగా

ఇన్‌స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ప్రొఫైల్ కస్టమైజేషన్‌ను మరింత మెరుగుపర్చడంలో భాగంగా ప్రొఫైల్ సాంగ్ ప్రవేశపెట్టింది. పేరులో ఉన్నట్లుగానే యూజర్లు తమ ప్రొఫైల్‌కు ప్రత్యేక పాటను పెట్టుకోవచ్చు. మూడ్‌కు అనుగుణంగా దాన్ని ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ మేరకు కొన్ని లైసెన్స్‌డ్ సాంగ్స్‌ను ఇన్‌స్టా అందుబాటులో ఉంచింది. దీని కోసం అమెరికాకు చెందిన ప్రముఖ గాయని సబ్రీనా కార్పెంటర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. యూజర్ బయో కింద ప్రొఫైల్ సాంగ్ ఫీచర్ కనిపిస్తుంది. మ్యూజిక్ ఐకాన్ ట్యాప్ చేస్తేనే పాట ప్లే అవుతుంది. 30 సెకన్ల నిడివి ఉన్న పాటను మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంటుంది. యూజర్లు మార్పులు చేసేవరకు ప్రొఫైల్‌లో ఆ సాంగ్ అలాగే ఉంటుంది. స్టేటస్ / స్టోరీస్ తరహాలో 24 గంటల్లో మాయమవదు.