బిజినెస్ క్లాస్‌కు పెరుగుతున్న డిమాండ్ ..

భారత్‌లో బిజినెస్ క్లాస్‌లో విమాన ప్రయాణం చేసే వారి సంఖ్య నానాటికి పెరుగుతున్నది. ప్రయాణ సౌలభ్యం కోసం బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించేందుకు చాలా మంది మొగ్గు చూపిస్తున్నారు. దీంతో ఈ తరగతి ప్రయాణికులను ఆకట్టుకోవడానికి విమాన రంగ సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. ఇప్పటికే ఎయిర్ ఇండియా, విస్తారా సంస్థలు ఈ బిజినెస్ క్లాస్ ప్రయాణ సేవలు అందిస్తుండగా, తాజాగా దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో కూడా వీటికి పోటీకి సిద్దమైంది. నవంబరు నుంచి ఇండిగోస్ట్రెచ్ పేరిట బిజినెస్ క్లాస్ సేవలు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ నుంచి దేశంలోని వివిధ మెట్రో నగరాలకు ప్రయాణించే 12 విమానాల్లో మొదట బిజినెస్ క్లాస్ సీట్లను ఏర్పాటు చేయనుంది.