రష్యా నుంచే అత్యధికం
దేశంలోకి ముడిచమురు దిగుమతి గత నెలలో అత్యధికంగా రష్యా నుంచే జరిగింది. రోజుకు 16 లక్షల బ్యారెళ్ల చొప్పున ముడిచమురు రష్యా నుంచి వచ్చింది. ఇరాక్ (రోజుకు 9.39 లక్షల బ్యారెళ్లు), సౌదీ అరేబియా (రోజుకు 6.47 లక్షల బ్యారెళ్లు) దేశాల నుంచి దిగుమతి అయిన ముడిచమురు కంటే కూడా ఇదే ఎక్కువ కావడం గమనార్హం. గతేడాది ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించే ముందు, మన ముడిచమురు దిగుమతుల్లో రష్యా వాటా 1 శాతం లోపే కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇది 35 శాతానికి చేరింది. ఫిబ్రవరిలో యూఏఈ నుంచి రోజుకు 4.04 లక్షల బ్యారెళ్లు, అమెరికా ఉంచి 2.48 లక్షల బ్యారెళ్ల ముడిచమురు దిగుమతి అయ్యింది.






