ఒకేసారి భారత్, అమెరికాలో ఏర్పాటు చేస్తాం : చిరంజీవ్ కథూరియా
వచ్చే నాలుగేళ్లలో భారత్ గగనతలంలో ఎయిర్ టాక్సీలు ఎగిరే అవకాశం ఉంది. ఇందుకోసం తమ కంపెనీ భారత్‌లో ఒక తయారీ ప్లాంటు ఏర్పాటు చేస్తుందని భారత్-అమెరికా వ్యాపారవేత్త, జాంట్ ఎయిర్‌కు చెందిన చిరంజీవ్ కథూరియా ప్రకటించారు. భారత్‌లో అర్బన్ ఎయిర్ మొబిలిటీ( యూఏఎమ్)ని అభివృద్ధి చేసేందుకు ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్‌తో జాంట్ ఎయిర్ మొబిలిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ఎయిర్ టాక్సీల తయారీ నిమిత్తం తొలుత అమెరికాలో ప్లాంటు ఏర్పాటు చేస్తాం. రెండో ప్లాంటు భారత్‌లో సిద్ధం చేస్తాం. 2025 కల్లా భారత్, అమెరికాల్లో వీటి తయరీ మొదలు పెడతామని కథూరియా తెలిపారు. హీడ్రన్ డ్రోన్ ఉత్పత్తిని మాత్రం భారత్‌లో వచ్చే ఏడాది నుంచే ప్రారంభిస్తామన్నారు. ఎయిర్ టాక్సీ సేవలను కెనడా, అమెరికాలో 2026`27 కల్లా ప్రారంభించాలన్నది కంపెనీ ప్రణాళికగా ఉందని తెలిపారు.






