ప్రపంచంలోనే అత్యంత వృద్ధి సాధించే దేశంగా భారత్ : ఐఎంఎఫ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023-24) మనదేశ వృద్ధి రేటు అంచనాలను 6.1 శాతం నుంచి 5.9 శాతానికి తగ్గిస్తున్నట్లు, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ప్రకటించింది. అయినా కూడా ప్రపంచంలో అత్యంత వేగవంత వృద్ధి సాధించే దేశంగా భారత్ నిలుస్తుందని పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గతంలో అంచనా వేసిన వృద్ధి రేటు 6.8 శాతాన్ని 6.3 శాతానికి కుదించింది. గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో 6.8 శాతం వృద్ధి నమోదు కావొచ్చని పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనా 7శాతం కంటే ఇది తక్కువ. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతం వృద్ధి రేటును ఆర్బీఐ అంచనా వేస్తోంది. 2022-23 పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి గణాంకాలను ప్రభుత్వం ఇంకా విడుదల చేయాల్సి ఉంది.






