కేటగిరీ-1 హోదాను నిలబెట్టుకున్న భారత్ : అమెరికా
విమానయాన భద్రతా ప్రమాణాల్లో మన దేశం కేటగిరీ-1 హోదాను నిలబెట్టుకుంది. అమెరికాకు చెందిన జాతీయ విమానయాన సంస్థ (ఎఫ్ఏఏ) ఈ హోదాను మరోసారి ఇచ్చింది. దీంతో మన దేశం నుంచి విదేశాలకు మరిన్ని విమాన సేవలను విస్తరించడానికి అవకాశం కలగనుంది. కొన్ని నెలల కిందటే అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏవో) జరిపిన ఆడిట్లో మన విమానయాన భద్రత భారీగా మెరుగుపడినట్లు తేలింది. మన దేశంలో విమానయాన రంగం విస్తరిస్తున్న వేళ ఇదో శుభవార్త. ఈ హోదాతో అమెరికా దేశంలో విమానయాన సంబంధాలున్న దేశాలకు మరిన్ని విమానాలను నడిపే అవకాశం దక్కుతుంది అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.






