Visakhapatnam : సంక్రాంతి ఎఫెక్ట్ … భారీగా పెరిగిన విమాన టికెట్ రేట్లు

సంక్రాంతి పండగకు ప్రజలంతా పెద్ద ఎత్తున సొంతూళ్లకు వెళ్తుండటంతో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో విమాన టెకెట్లకు భారీగా డిమాండ్ పెరిగింది. హైదరాబాద్, బెంగళూరు నుంచి విశాఖ (visakhapatnam) వచ్చే వారికి విమానటికెట్ (Airline ticket) ధలు షాక్ కొట్టిస్తున్నాయి. శని, ఆదివారాల్లో హైదరాబాద్ (Hyderabad) నుంచి కనీస ఛార్జీ రూ.17,500కి పైమాటే. బెంగళూరు (Bangalore) నుంచి విశాఖ రావాలంటే కనీసం రూ.12 వేలు పెట్టాల్సిందే. సాధారణ రోజుల్లో హైదరాబాద్, బెంగళూరు నుంచి కనీస ధర రూ.3,400 నుంచి రూ.వేలు ఉండగా, ప్రస్తుతం మూడు నాలుగు రెట్లు పెరిగిపోయింది. అయినప్పటికీ, సొంతూళ్లకు వెళ్లాలనే ప్రయాసతో వేలకు లేవు పెట్టుకని ప్రయాణాలు సాగిస్తున్నారు.