లాటిన్ అమెరికా ట్రేడ్ కౌన్సిల్ డైరెక్టర్ గా హేమనాథ్ శ్రీనివాస్
లాటిన్ అమెరికా ట్రేడ్ కౌన్సిల్ డైరెక్టర్గా హేమనాథ్ శ్రీనివాస్ నియమితులైనట్టు ఇండియన్ ఎకనమిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తెలిపింది. చెన్నైలో జరిగిన సమావేశంలో మొత్తం 33 దేశాల కూటమితో లాటిన్ అమెరికా ట్రేడ్ కౌన్సిల్ ఏర్పాటైనట్టు వివరించింది. ఈ సమావేశంలో ఇండియన్ ఎనకమిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ ఇక్బాల్, రష్యన్ ఫెడరేషన్ కౌన్సిల్ జనరల్ ఓలెగ్ ఎన్ అప్డేవ్, ఇండోనేషియా ట్రేడ్ ప్రమోషన్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ అజి కహ్యది, విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారి వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు.






