హెచ్‌సీఎల్ గుడ్ న్యూస్.. మరో వెయ్యి మందిని
గ్లోబల్ ఐటీ రంగంలో కొనసాగుతున్న తొలగింపుల మధ్య, భారతీయ ఐటీ మేజర్ గుడ్ న్యూస్ చెప్పింది. కొంతమంది ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయించినట్లు హెచ్‌సీఎల్ తాజాగా ప్రకటించింది. రాబోయే రెండేళ్లలో రొమేనియాలో 1,000 మంది ఉద్యోగులను నియమించు కోనున్నట్లు ప్రకటించింది. రొమేనియాలో తన కార్యకలాపాలను విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రముఖ రోమేనియన్ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం ద్వారా మూడో వంతు చోటు కల్పించనుంది. హెచ్‌సీఎల్ ఐదేళ్లుగా రోమేనియాలో పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో గ్లోబల్ క్లయింట్లకు సేవలందించేలా ఇప్పటికే దేశంలో దాదాపు 1,000 మంది ఉద్యోగులుండగా, మరో వెయ్యిమందిని చేర్చుకోనుంది. ఐటీ సేవల్లో వృద్ధిని కొనసాగించేందుకు స్థానిక ప్రతిభావంతులకు మరిన్ని అవకాశాలను సృష్టించేందుకు కంపెనీ బుకారెస్ట్, ఇయాసీలో ఉద్యోగులను పెంచుకుంది. తమకు రోమేనియా కీలకమైన మార్కెట్ అని అందుకే మరింత మెరుగైన సేవలందించేలా వర్క్‌ఫోర్స్‌ను పెంచుకుంటున్నామని ఐడీసీ అసోసియేట్ కన్సల్టెంట్ అలెగ్జాండ్రా సిమియన్ వెల్లడిరచారు.






