చాట్ జీపీటీకి పోటీగా వెయ్యి భాషలతో ఏఐ
కృత్రిమ మేధ రంగంలోనూ ఆధిపత్యం చూపాలని టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ప్రణాళికలు వేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న చాట్‌జీపీటీకి పోటీగా వెయ్యి భాషలను సపోర్టు చేసేలా ఓ ఏఐ మాడల్‌ను అభివృద్ధి చేసే పనిలో పడింది. గూగుల్ గత నవంబర్‌లో యూనివర్సల్ స్పీచ్ మాడల్ (యూఎస్ఎం)ను పరిచయం చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడే 1,000 భాషలను సపోర్టు చేసేలా ఓ లాంగ్వేజ్ మాడల్‌ను షృష్టిస్తామని ప్రకటించింది. తన లక్ష్యాలను చేరుకోవడంలో యూఎస్ఎం కీలక అడుగుగా గూగుల్ భావిస్తున్నది.






