గూగుల్ సంచలన నిర్ణయం.. గతంలో కంటే ఈ ఏడాది కూడా
ఇటీవల కాలంలో అనేకమంది ఉద్యోగులను గూగుల్ తొలగించిస సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ప్రమోషన్ల విషయంలోనూ గూగుల్ యాజమన్యాం సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో కంటే ఈ ఏడాది తక్కువ ప్రమోషన్లు ఉంటాయని ఉద్యోగులకు గూగుల్ సమాచారం అందించినట్లు తెలిసింది. ప్రమోషన్ల ప్రక్రియ గతంలో మాదిరిగానే మేనేజర్ల నేతృత్వంలో ఉండనుంది. అయితే నియమాలు పెద్దగా చేపట్టకపోవడంతో ఈ ఏడాది ప్రమోషన్లు కూడా తక్కువ సంఖ్యలోనే ఉంటాయని పేర్కొంది. అది కూడా ఎల్ 6, ఆపై స్థాయిలోనే ప్రమోషన్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. గూగుల్ తీసుకొచ్చిన కొత్త పనితీరు సమీక్ష వ్యవస్థ ప్రకారం సీనియర్లు, నాయకత్వ స్థాయిలో తగినంతమంది ఉద్యోగులు ఉండాలి. అందుకు అనుగుణంగా ఈ ప్రమోషన్లు ఉంటాయని యాజమాన్యం ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్లో స్పష్టం చేసినట్లు సమాచారం.






