India : ఇండియా -యూకే మధ్య వాణిజ్య ఒప్పందం

భారత్-యూకే మధ్య ఈ నెల 24న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టిఎ) పై సంతకాలు జరుగుతాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) తెలిపారు. రెండు దేశాల మధ్య జరిగిన వాణిజ్య చర్చలు మే 6న ముగిశాయి. వాణిజ్య ఒప్పందంపై బ్రిటన్ (Britain), భారత్ ప్రధాన మంత్రుల సమక్షంలో సంతకాలు జరగనున్నాయి. వాణిజ్య ఒప్పందంలో భాగంగా మన దేశం నుంచి లెదర్ ఉత్పత్తులు, పాదరక్షలు, బట్టల ఎగుమతులపై పన్నులను పూర్తిగా తొలగిస్తారు. మన దేశానికి బ్రిటన్ నుంచి వచ్చే దిగుమతులు విస్కీ (Whiskey) , కార్లు (cars) వంటి వాటిపై సుంకాలు తగ్గిస్తారు. రెండు దేశాల మధ్య 2030 నాటికి 120 బిలియన్ డాలర్ల మేర వాణిజ్య జరుగుతుందని అంచనా వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi ) ఈ నెల 24 నుంచి మాల్దీవులు, బ్రిటన్ పర్యటనకు వెళ్లనున్నారు.