ఫాక్స్ కాన్ సంచలన ప్రకటన.. ఆ దేశంలో ఎటువంటి
భారత్లో పెట్టుబడులపై తైవాన్ ఎలక్ట్రానిక్ మేజర్ ఫాక్స్కాన్ సంచలన ప్రకటన చేసింది. తమ కంపెనీ చైర్మన్ ఇటీవల భారత్లో పర్యటించారని, కానీ ఆ దేశంలో ఉత్పాదక రంగంలో పెట్టుబడులపై ఎటువంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదని ఒక ప్రకటనలో తెలిపింది. భారత్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు వచ్చిన ప్రచారాన్ని ఖండించింది. గత నెల 27 నుంచి ఈ నెల 4 వరకు హోన్ హాయ్ టెక్నాలజీ గ్రూప్ అనుబంధ సంస్థ ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియూ సారధ్యంలోని బృందం భారత్లో పర్యటించింది. యుంగ్ లియూ పర్యటనలో భారత ప్రభుత్వంతో ఎటువంటి ఒప్పందాలు కూదుర్చుకోలేదని ఫాక్స్కాన్ వెల్లడించింది. భారత్లో పెట్టుబడుల విషయమై కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది.






