ఊహించిన దానికంటే ఎక్కవగానే .. పెరిగే అవకాశం
అమెరికాలో వడ్డీరేట్ల పెంపు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఊహించిన దానికంటే వడ్డీరేట్లు ఎక్కువగానే పెరిగే అవకాశం ఉందని అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోం పోవెల్ అమెరికా సెనెట్ బ్యాంకింగ్ కమిటీ ముందు చెప్పారు. ద్రవ్యోల్బణం విషమిస్తే వడ్డీరేట్లు మరింత వేగంగా పెంచేందుకు తాము సిద్ధంగానే ఉన్నట్లు తెలిపారు. కొండెక్కిన ద్రవ్యోల్బణం రెండు శాతం దిగువకు వచ్చేందుకు చాలా సమయం పడుతుందన్నారు. పోవెల్ వ్యాఖ్యలతో అమెరికా స్టాక్‌మార్కెట్ నష్టాల్లోకి జారుకుంది. దీంతో వచ్చే సమావేశంలో ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లు మరో అర శాతం పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే ఆర్బీఐ కూడా వడ్డీరేట్లు మరింత పెంచక తప్పదు.






