ఎలన్ మాస్క్ కీలక ప్రకటన
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. ట్విట్టర్ పోల్స్‌లో పాల్గొనాలనుకునే వాళ్లు బ్లూటిక్ ఉన్న వెరిఫైడ్ అకౌంట్లను కలిగి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. లేని పక్షంలో ఏప్రిల్ 15 నుంచి ట్విటర్ పోల్స్ లో పాల్గొనే అవకాశం ఉండదని తెలిపారు. ఏప్రిల్ 15 నుంచి వెరిఫైడ్ అకౌంట్లు మాత్రమే ఫర్ యూ రెకమెండేషన్లో ఉండడానికి అర్హత పొందుతాయని తెలిపారు. 2022 అక్టోబర్‌లో ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి మస్క్ అనేక నిర్ణయాలు తీసుకున్నారు. కంపెనీలో పెద్దస్థాయిలో ఉద్యోగుల తొలగింపు, బ్లూ టిక్ కోసం డబ్బు వసూళ్లు, గోల్డ్ టిక్ వంటి నిర్ణయాలను ఆయన తీసుకున్నారు.






