చాట్‌జీపీటీకి పోటీగా… ట్రూత్‌జీపీటీ
కృత్రిమ మేధ (ఏఐ) వల్ల మానవకోటికి ప్రమాదం ఎదురయ్యే అవకాశాలున్నాయని ట్విటర్ యజమాని ఎలాన్ మస్క్ పునరుద్ఘాటించారు. ప్రముఖ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీకి ప్రత్యామ్నాయంగా ట్రూత్జీపీటీని ఆవిష్కరించాలని భావిస్తున్నా. సమాజ ధోరణులను అర్థం చేసుకోవడానికి అవసరమయ్యే నిజాలు ఇందులో ఉంటాయి అని పేర్కొన్నారు. మనుషులను ధ్వంసం చేయడానికి బదులు అర్థం చేసుకునే ఏఐ మనకు కావాలి. చాట్‌జీపీటీకి రాజకీయపరంగా నిజాలను అందించేలా శిక్షణనిస్తున్నారని ఆరోపించారు. కార్లు, రాకెట్ల కంటే అత్యంత ప్రమాదకరమైనది కృత్రిమ మేధే. అందుకే దీని నియంత్రణ అవసరమని వివరించారు.






