ఎలాన్ మస్క్ మరో ఘనత… చరిత్రలో ఏ సంపన్నడూ ఈ స్థాయిలో
ప్రపంచ కుబేరుడిగా ఎదిగిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇటీవలే ప్రథమ స్థానాన్ని కోల్పోయారు. 2022లో ఆయన మరో ఘనత సాధించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా 200 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయారు. చరిత్రలో సంవత్సర కాలంలో అత్యంత ఎక్కువ సంపద కోల్పోయిన వ్యక్తిగా ఎలాన్ మస్క్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కారు. ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ వెల్లడిరచింది.అతి తక్కువ కాలంలోనే ప్రపంచ నెంబర్ వన్ కుబేరుడిగా ఎదిగిన ఆయన అంతే వేగంగా సంపదను కోల్పోయారు. ట్విటర్‌ను కొనుగోలు చేసిన తరువాత చెల్లింపుల కోసం ఆయన టెస్లాలో తనకు ఉన్న షేర్లను బారీగా విక్రయించారు. ఈ క్రమంలోనే ఆయన ఎక్కువ సంపద కోల్పోయిన వ్యక్తిగి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. 2021-22 ఒక్క ఏడాది వ్యవధిలో ఎలాన్ మస్క్‌కు చెందిన 182 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయారు. చరిత్రలో ఏ సంపన్నడూ ఈ స్థాయిలో నష్టాన్ని ఎదుర్కోలేదని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పేర్కొంది.






