ట్విట్టర్ అకౌంట్ తో మస్క్ కు ఆదాయం.. ఎంతో తెలుసా?
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తరువాత అనేక మార్పులు చేశారు. భారీగా ఉద్యోగులను తొలగించారు. ట్విటర్ కంటెంట్ విషయంలోను మార్పులు చేశారు. బ్లూ టిక్కు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. యూజర్లు తమ కంటెంట్ నుంచి డబ్బులు సంపాదించేందుకు వీలు కల్పించారు. సమాచారం నుంచి వీడియోల వరకు దేనికైనా యూజర్లు తమ అకౌంట్‌కు సబ్స్క్రిపన్స్ ఆఫ్షన్ తీసుకు వచ్చారు. దీంతో యూజర్లు డబ్బులు సంపాదించుకునే వీలు కలుగుతుంది. ట్విటర్ కొత్తగా ప్రవేశపెట్టిన సబ్స్క్రిపన్స్ ఆప్షన్ గురిచి తెలియ చేసేందుకు మస్క్ ఒక స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేశారు. యూజర్లు మానటైజేషన్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవడం ద్వారా సబ్‌స్క్రిప్షన్‌కు వెళ్లవచ్చని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన తన అకౌంట్ ఫాలోవర్లు, సబ్స్క్రైబర్ల సంఖ్యను వెల్లడించారు. దీని ప్రకారం మస్క్ ఖాతాకు 24,700 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారని వెల్లడైంది. ట్విటర్ సబ్స్క్రిప్షన్ రేటు అమెరికాలో 5 డాలర్లుగా ఉంది. ఇందులో యాపిల్ ఇన్ యాప్ పర్చేజ్, ట్విటర్ రెవెన్యూ షేర్ పోనూ ఒక్కో సబ్‌స్క్రైబర్ నుంచి 3.39 డాలర్ల చొప్పున కంటెంట్ క్రియేటర్‌కు ట్విటర్ చెల్లిస్తుంది. ఈ లెక్కన ఎలన్ మస్క్ ట్విటర్ ఖాతాకు 24,700 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. దీంతో ఆయన వీరి ద్వారా నెలకు 68,42,00 రూపాయల ఆదాయం వస్తోంది. ఏడాదికి 8.2 కోట్ల ఆదాయం ఆయన పొందుతున్నారు.






