Google :భారతీయ విద్యార్థులకు గూగుల్ గుడ్ న్యూస్… ఏడాది పాటు ఉచితంగా

భారతీయ విద్యార్థులకు గూగుల్ (Google) గుడ్‌న్యూస్ చెప్పింది. గూగుల్ అడ్వాన్స్‌డ్ ఏఐ టూల్స్ (AI tools) ను ఏడాది పాటు ఉచితంగా వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది. జెమిన్ ఫర్ స్టూడెంట్స్ పేరిట ఈ అవకాశాన్ని తీసుకొచ్చింది. 18 ఏళ్లు, అంతకు పైబడిన విద్యార్థులు (Students) ఏడాది ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను పొందొచ్చు. ఈ కాలంలో 2 టీబీ క్లౌడ్ స్టోరేజీ కూడా ఉచితంగా లభిస్తుంది. జెమినీ (Gemini) సేవలను ఉపయోగించుకోవడానికి విద్యార్థులు ముందుగా గూగుల్ ఆఫర్ పేజీ ద్వారా నమోదు చేసుకోవాలి.
దీనికి సెప్టెంబరు 15 చివరి తేదీగా సంస్థ నిర్ణయించింది. ఒకసారి నమోదు చేసుకున్న తర్వాత గూగుల్లో పవర్‌పుల్ ఏఐ మోడల్ అయిన జెమినీ 2.5 ప్రోను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో చదువుకోవడానికి, రైటింగ్ (Writing), రీసెర్చ్ ఉద్యోగానికి కావాల్సిన టూల్స్ ఉన్నాయి. పరీక్షలు, హోంవర్కులు, వ్యాసరచన, కోడిరగ్, ముఖాముఖీలకు అన్‌లిమిటెడ్ అకడమిక్సపోర్ట్ ఉపయోగపడుతుంది. ఈ జెమినీ అడ్వాన్స్‌డ్ ప్లాన్‌ను కొనుగోలు చేయాలంటే రూ.19,500 ఖర్చవుతుంది.