America: జాతీయ భద్రత దృష్ట్యానే ..భారత వాహనాలపై : అమెరికా

భారత్ ఆటోమొబైల్, విడిభాగాలపై తాము విధిస్తున్న పన్నులు ప్రపంచ వాణిజ్య సంస్థ ( డబ్ల్యూటీఓ) నిబంధనల ప్రకారం రక్షణాత్మక వైఖరి కిందకు రావని అమెరికా (America) తేల్చి చెప్పింది. తమ దేశ జాతీయ భద్రతను దృష్టిలోపెట్టుని మాత్రవే వాటిని విధించామని, వీటిపై భారత్ (India) ఎటువంటి ప్రతీకార సుంకాలు విధించడానికి అవకాశం లేదని వెల్లడిరచారు. ఈ మేరకు డబ్ల్యూటీఓ (WTO)కు సమాచారం ఇచ్చింది. ట్రంప్ (Trump) తీసుకున్న చర్యలు రక్షణాత్మక వైఖరి కాదు అని వెల్లడిరచారు. అంతేకాదు డబ్ల్యూటీఓ అగ్రిమెంట్ ఆన్ సేఫ్‌గార్డ్స్ కింద చేపట్టాల్సిన చర్యలను భారత్ పాటించడం లేదని ఆరోపించింది. అమెరికా సెక్షన్ 232 టారిఫ్‌లను చర్చించదని ఎందుకంటే తాము వీటిని రక్షణాత్మక చర్యలుగా చూడటం లేదని వెల్లడిరచింది.