డాక్టర్ రెడ్డీస్ కు అమెరికా షాక్
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, అమెరికా మార్కెట్ నుంచి 4,320 బాటిళ్ల టాక్రోలిమస్ కేప్సూల్స్‌ను వెనకిక తీసుకుంటోంది. ప్యాకేజింగ్ పొరపాటు కారణంగా ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలిసింది. అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేసిన వ్యక్తులకు, కొత్త అవయవాన్ని శరీరం తిరస్కరించకుండా టాక్రో లిమస్ కేప్సూల్స్‌ను వినియోగిస్తారు. ఈ కేవ్సూల్స్ ఉన్న బాటిళ్లలో 1 ఎంజీ డోసు కేప్సూల్స్లో పాటు 0.5 ఎంజీ డోసు కేప్సూల్స్ కూడా కలిసిపోయినట్లు సమాచారం. ఈ మందును డాక్టర్ రెడ్డీస్‌కు చెందిన హైదరాబాద్‌లోని బాచుపల్లి యూనిట్లో ఉత్పత్తి చేసి యూఎస్‌కు సరఫరా చేశారు.






