వారికి ఉద్యోగం గ్యారంటీ కానీ … డేట్ మారొచ్చు

రెండేళ్ల క్రితం నియమాకాలు చేపట్టి 2000 మందిని ఎంపిక చేసినా ఇప్పటికే వారిని విధుల్లోకి తీసుకోకపోవడంతో ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ పై కొంతకాలంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కార్మిక శాఖ వద్ద ఫిర్యాదు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఆన్‌బోర్డ్ ఆలస్యమవడంపై తాజాగా కంపెనీ సీఈఓ సలీల్ పరేఖ్ స్పందించారు. తేదీలు మారినప్పటికీ ఆఫర్ వచ్చిన ప్రతి ఒక్కరూ కంపెనీలో చేరుతారని వెల్లడిరచారు. మేం ఇచ్చిన ప్రతి ఆఫర్ మా పరిగణనలో ఉంటుంది. ఆ ఆఫర్ దక్కించుకున్న ప్రతి ఒక్కరూ కంపెనీలో తప్పకుండా చేరుతారు. కొన్ని కారణాల వల్ల తేదీలను మార్చొచ్చు. అంతేగానీ, వారిని ఉద్యోగంలోకి తీసుకోవడం మాత్రం గ్యారంటీ. అందులో ఎలాంటి మార్పు ఉండదు అని సలీల్ పరేఖ్ వెల్లడిరచారు.