చైనా రక్షణ బడ్జెట్ .. గత ఏడాది కంటే ఈసారి కూడా
చైనా తన రక్షణ బడ్జెట్ను మరోసారి పెంచేసింది. గత ఏడాది కంటే ఈసారి 7. 2 శాతం ఎక్కువగా కేటాయించింది. దీంతో చైనా రక్షణ శాఖ బడ్జెట్ 2.25 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.18,38,537 కోట్లు) చేరింది. గతేడాది కూడా 7.1 శాతం పెంపుతో రక్షణ బడ్జెట్ను 1.45 ట్రిలియన్ యువాన్లకు చేర్చింది. చైనా ప్రధాని లీ కెక్వియాంగ్ ఎన్సీపీకి తన వర్క్ రిపోర్టును సమర్పిస్తూ సరిహద్దులో పలు అంశాల్లో తమ సాయుధ దళాలు గొప్ప విజయాలు సాధించాయని పేర్కొన్నారు. చైనాకు భారత్, తైవాన్ తదితర దేశాలతో సరిహద్దు వివాదాలు ఉన్న విషయం తెలిసిందే.






