అరబిందో ఫార్మా లెనలిడోమైడ్ కేప్సూల్స్ కు అమెరికాలో అనుమతి
మల్టిఫుల్ మైలోమా అనే కేన్సర్ వ్యాది చికిత్సలో వినియోగించే లెనలిడోమైడ్ కేప్సూల్స్ను అరబిందో ఫార్మా అమెరికాలో విక్రయించనుంది. ఈ ఔషధానికి తన అనుబంధ సంస్థ అయిన యూగియా ఫార్మా స్పెషాలిటీస్, యూఎస్ఎఫ్డీఏ(అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ) నుంచి తుది అనుమతి తీసుకున్నట్లు అరబిందో ఫార్మా వెల్లడిరచింది. లెనలిడోమైడ్, బీఎంఎస్ ( బ్రిస్టల్ మేర్స్ స్విబ్ కంపెనీ) కు చెందిన రెవ్లీమిడ్ అనే బ్రాండుకు జనరిక్ ఔషధం. ఈ ఏడాది అక్టోబరులో లెనలిడోమైడ్ ఔషధాన్ని 2.5, 5, 10, 20, 25 ఎంజీ డోసుల్లో అమెరికాలో విడుదల చేయనున్నట్లు అరబిందో ఫార్మా పేర్కొంది. యూఎస్ ఎఫ్డీఏ నుంచి ఇప్పటి వరకు యూగియా ఫార్మాకు 115 ఔషధాలకు ఏఎన్డీఏ నుంచి ఇప్పటి వరకు యూగియా ఫార్మాకు 155 ఔషధాలకు ఏఎన్డీఏ (అబ్రివియేటెడ్ న్యూడ్రగ్ అప్లికేషన్) అనుమతులు వచ్చినట్లు అరబిందో ఫార్మా వివరించింది. లెనలిడోమైడ్ ఔషధాన్ని డెక్సామెథజోన్ అనే మందుతో కలిపి మల్టిపుల్ మైలోమా బాధితులు వినియోగిస్తారు.






