యాపిల్ శుభవార్త… భారత్‌లో మరో 6 లక్షలు

టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ భారత్‌పై మరింత దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా వచ్చే నెల 9న విడుదల చేసే ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడల్స్‌ను భారత్‌లో తయారు చేసేందుకు సిద్ధమవుతోంది. దీనివల్ల ఈ ఆర్థిక సంవత్సరం చివరికి ప్రత్యక్షంగా రెండు లక్షలు, పరోక్షంగా 6 లక్షల కొత్త ఉద్యోగాలు ఏర్పడతాయని అంచనా. కొత్త ఉద్యోగాల్లో 70 శాతం వరకు మహిళలే ఉంటారని భావిస్తున్నారు. తమిళనాడులోని శ్రీపెరం బుదూర్ వద్ద ఉన్న ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో ఈ ఐఫోన్లు తయారవుతాయని సమాచారం. ఫాక్స్ కాన్ ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించినట్లు తెలుస్తోంది.