ప్రముఖ ఐటీ కంపెనీ యాక్సెంచర్ సంచలనం.. ఒకేసారి 19 వేల మంది
ప్రముఖ ఐటీ కంపెనీ యాక్సెంచర్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇస్తోంది. కంపెనీ ఆదాయ క్షీణత నేపథ్యంలో 19 వేల ఉద్యోగాలను తీసివేయనుంది. అటు వార్షిక రాబడి, లాభాల అంచనాలను కూడా తగ్గించింది. ఈ మేరకు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. తమ సిబ్బందిలో 2.5 శాతం లేదా 19,000 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు తెలిపింది. సగానికి పైగా తొలగింపులు నాన్ బిల్ కార్పొరేట్ ఫంక్షన్ల సిబ్బందిని ప్రభావితం చేస్తాయని వెల్లడించింది. మరోవైపు యాక్చెంచర్ తమ వార్షిక రాబడి వృద్ధిని కూడా కుదించుకుంది. గతంలో అంచనా వేసిన 8-11 శాతంతో పోలిస్తే 8-10 శాతం మధ్య ఉంటుందని భావిస్తోంది.






