వాషింగ్టన్ డీసీలో ప్రారంభమైన జి20 సమావేశం
వాషింగ్టన్ డిసీలో 20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల (ఎఫ్ఎంసిబిజి) 2వ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ ఆర్థిక నిర్మాణం, స్థిరమైన ఫైనాన్స్, ఆర్థిక రంగం, ఆర్థిక చేరిక అంతర్జాతీయ పన్నుల గురించి చర్చించడానికి మూడు సెషన్లు ఉన్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి జి20 దేశాలకు చెందిన వారి సహచరులు, ప్రధాన అంతర్జాతీయ సంస్థలతో సహా ఇతర ప్రతినిధి బృందాల అధిపతులతో భారతదేశం యొక్క జి20 ప్రెసిడెన్సీలో పరస్పర ఆసక్తి సహకారం యొక్క సమస్యలు, రంగాలపై చర్చించారు. ఆహారం, ఇంధన అభద్రత, గ్లోబల్ డెట్ వల్నరబిలిటీలను నిర్వహించడం, బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులను (ఎండిబిలు), వాతావరణ చర్యల కోసం ఆర్థిక సమీకరణ, ఆర్థిక చేరిక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం, అంతర్జాతీయ పన్ను, ఆర్థిక పురోగతిని వేగవంతం చేయడం వంటి కీలక అంశాలపై సమావేశంలో చర్చలు జరిగాయి. జి 20 సభ్య దేశాలే కాకుండా 13 ఆహ్వానించబడిన దేశాలు, వివిధ అంతర్జాతీయ, ప్రాంతీయ సంస్థల నుండి దాదాపు 350 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.






