ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

వైజాగ్‌లోనే ఈసారి ప్రమాణ స్వీకారం.. జగన్ సంచలన ప్రకటన

వైజాగ్‌లోనే ఈసారి ప్రమాణ స్వీకారం.. జగన్ సంచలన ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాజధానుల వ్యవహారంలో ఇప్పటికీ గందరగోళం కొనసాగుతూనే ఉంది. అమరావతిని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎంపిక చేసి అభివృద్ధికోసం యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. ఇంతలో ఆ పార్టీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ రాజధానిని అమరావతికి మాత్రమే పరిమితం చేకుండా మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. అయితే దానికి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు సీఎం జగన్ మాత్రం కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. ఎన్నికల తర్వాత ప్రమాణ స్వీకారం వైజాగ్ లోనే ఉంటుందని.. వైజాగ్ లోనే నివాసం ఉండబోతున్నానని ప్రకటించారు.

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడం సాధ్యం కాదని ప్రకటించారు. ఇందుకోసం లక్షకోట్లు అవసరమవుతాయని.. ఇప్పుడు అంత భరించే శక్తి రాష్ట్రానికి లేదని వెల్లడించారు. అందుకే రాజధానులను వికేంద్రీకరించి మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు 3 రాజధానులను తెరపైకి తెచ్చారు. విశాఖలో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని డిసైడయ్యారు. అసెంబ్లీలో బిల్లు కూడా ఆమోదం పొందింది. అయితే మండలిలో మాత్రం కుదరలేదు. అదే సమయంలో రాజధాని రైతులతో పాటు పలు రాజకీయ పార్టీలు కూడా కోర్టులో ఈ అంశంపై పిటిషన్లు దాఖలు చేశాయి.

కోర్టులు మొట్టికాయలు వేయడంతో మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకుంది ప్రభుత్వం. దీంతో 3 రాజధానుల ఏర్పాటు ఆగిపోయింది. ప్రస్తుతానికి రాజధాని అమరావతికే పరిమితం అయింది. అయితే వైజాగ్ లో క్యాంప్ ఆఫీసు ఏర్పాటు చేసి అక్కడి నుంచే పరిపాలన చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు. అందుకోసం రిషికొండలో ఉన్న పర్యాటక భవనాలను అత్యాధునికంగా తీర్చి దిద్దారు. అవి ఇప్పుడు పూర్తయ్యాయి. ఇటీవలే మంత్రులు గుడివాడ అమరనాథ్, రోజా వాటిని ప్రారంభించారు. అక్కడ సీఎం నివాసంతో పాటు క్యాంప్ కార్యాలయం ఉండనుంది.

గతంలో ఒకసారి ఢిల్లీలో, మరోసారి వైజాగ్ లో సీఎం జగన్ త్వరలోనే తాను వైజాగ్ షిఫ్ట్ కాబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు వైజాగ్ లో మరోసారి ఇదే స్టేట్ మెంట్ ఇచ్చారు. ఎన్నికలైన తర్వాత వైజాగ్ లోనే ప్రమాణస్వీకారం చేయబోతున్నానని.. తాను కూడా ఇక్కడే నివాసం ఉండబోతున్నానని వెల్లడించారు. వాస్తవానికి సీఎం ప్రమాణ స్వీకారానికి, నివాసం ఉండడానికి రాజధానే అవ్వాల్సిన అవసరం లేదు. రాజధాని తరలింపు వేరు.. సీఎం ప్రమాణ స్వీకారం, నివాసం ఉండడం వేరు. మరి రాజధానిని తరలించే ఉద్దేశంతో జగన్ ఈ స్టేట్ మెంట్ ఇచ్చారా.. లేకుంటే కేవలం ప్రమాణ స్వీకారానికి, నివాసం ఉండడానికి మాత్రమే ఇలా చెప్పారా.. అనేది వేచి చూడాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :