విప్రో ఉద్యోగులకు శుభవార్త... మూడు నెలలకొకసారి!

సాఫ్ట్‌వేర్ కంపెనీ విప్రో జీతాల పెంపు విషయంలో నిర్ణయాన్ని మార్చేది లేదని పేర్కొన్నది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి యధావిధిగా జీతాలను పెంచనున్నట్లు ఆ కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే తాము తీసుకున్న నిర్ణయంపైనే కట్టుబడి ఉన్నామని తెలిపింది. క్వార్టర్లీ ప్రమోషన్‌లో భాగంగా తొలి దశ పూర్తి అయినట్టు ఆ సంస్థ చెప్పింది. జీతాలను పెంపు విషయంలో ఎటువంటి మార్పు లేదని, పెంచిన జీతాలను సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఇవ్వనున్నట్లు విప్రో తెలిపింది. జులై నుండి విప్రో ఉద్యోగులకు ప్రమోషన్‌లు ఇవ్వడం ప్రారంభించింది. ఇందులో భాగంగా కంపెనీ తన టాప్ పెర్ఫార్మర్లకు , మిడ్ నేజ్‌మెంట్ స్థాయి వరకు ప్రమోషన్లను అందించాలని నిర్ణయించుకుంది. సెప్టెంబర్‌లో ఆ సంఖ్య మరింత పెంచే అవకాశం ఉంది అని విప్రో తెలిపింది.







Tags :