ASBL NSL Infratech

ర‌వితేజ‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాల‌ని చూస్తున్న అనుదీప్

ర‌వితేజ‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాల‌ని చూస్తున్న అనుదీప్

ర‌వితేజ నుంచి చివ‌రిగా వ‌చ్చిన ఈగ‌ల్ సినిమా అత‌ని ఫ్యాన్స్ ను బాగా డిజ‌ప్పాయింట్ చేసింది. రావ‌ణాసుర‌, టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు లాంటి సినిమాల‌తో కూడా ర‌వితేజ మంచి స‌క్సెస్ అందుకోలేక‌పోయాడు. దీంతో వ‌రుస ఫ్లాపుల‌తో ర‌వితేజ ను ఎటాక్ చేశాయి. ఈ సినిమాలు చేస్తున్న టైమ్ లోనే ర‌వితేజ ద‌గ్గ‌ర‌కు అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్ ఒక‌టి వ‌చ్చింది.

కానీ ఆ సినిమాను ర‌వితేజ వెంట‌నే సెట్స్ పైకి తీసుకెళ్లలేక‌పోయాడు. జాత‌ర‌త్నాలు, ప్రిన్స్ సినిమాల డైరెక్ట‌ర్ అనుదీప్, ర‌వితేజ్ కు ఓ క‌థ‌ను చెప్పి ఓకే చేయించుకున్నాడు. కొన్ని కార‌ణాల వ‌ల్ల సినిమా ప‌ట్టాలెక్క‌లేదు. అయితే ఇప్పుడు ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తార‌ని టాక్ వినిపిస్తోంది. ఓ ఏడాది నుంచి దీనిపై డిస్కష‌న్స్ న‌డుస్తున్న‌ప్ప‌టికీ ఇంకా సినిమాను అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌లేదు.

మాస్ రాజాలోని కామెడీ టైమింగ్ కు అనుదీప్ లోని కామెడీ సెన్స్ యాడ్ అయితే మంచి అవుట్‌పుట్ వ‌స్తుంద‌ని మాస్ మహారాజా ఫ్యాన్స్ అభిప్రాయ ప‌డుతున్నారు. త‌మిళంలో శివ కార్తికేయ‌న్ తో తాను చేసిన ప్రిన్స్ మూవీ అనుకున్న ఫ‌లితాన్ని అందుకోక‌పోవ‌డంతో ఈసారి ఎలాగైనా సాలిడ్ సక్సెస్ అందుకోవాల‌ని చూస్తున్నాడు అనుదీప్. అందుకే ర‌వితేజ కోసం అనుదీప్ ఓ సూప‌ర్ స్క్రిప్ట్ ను రెడీ చేసిన‌ట్లు టాక్ వినిపిస్తోంది.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :