ASBL NSL Infratech

ఏపీ ఎన్నికల్లో హై టెన్షన్ సృష్టిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు..

ఏపీ ఎన్నికల్లో హై టెన్షన్ సృష్టిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు..

ఏపీ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు హై టెన్షన్ సృష్టిస్తున్నారు. 2014లో వీరి మద్దతు చంద్రబాబుకు ఇచ్చారు.. 2019లో జగన్ పక్కన నిలబడ్డారు. మరి 2024లో ఏ గట్టుమీద ఉంటారో అర్థం కాని పరిస్థితిలో అందరిని టెన్షన్ కి గురిచేస్తున్నారు. ఎందుకంటే వీళ్లు ఎవరికి ఓటు వేస్తారు అన్న విషయాన్ని పరమ సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారు. విధులకు హాజరయ్యే ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును ను వినియోగించుకోవడానికి పోస్టల్ బ్యాలెట్ ని వాడుతారు. అలా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఆంధ్రాలో ఈరోజు నుంచే అంటే మే 4వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతోంది.

ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు కు మే 4.. ఓపిఓలకు మే 5..పోలీస్ సిబ్బంది, ఎసెన్షియల్ సర్వీసెస్, డ్రైవర్లు  తదితరులు మే 6 పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించి తమ ఓటును వేస్తారు. విధులలో ఉన్న ఉద్యోగులందరూ ఈనెల 6 నుంచి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఒక రకంగా చెప్పాలి అంటే రేపు ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుంది అన్నదానికి ఇప్పుడు వీళ్లు వేస్తున్న ఓట్లే ముఖ్యం. అందుకే మొన్న నెల్లూరు సభలో చంద్రబాబు ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులకు విన్నపం చేసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్లు ప్రారంభం కాబోతున్నాయని.. ఉద్యోగస్తులు అందరిని ఓటు కూటమికి వేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రెండు ప్రభుత్వాలకు సంబంధించి ఉద్యోగస్తులకు సాధకబాధకాలు ఉన్నాయి. కొందరు టీడీపీ విధానాన్ని సమర్థిస్తుంటే.. మరికొందరు వైసీపీ వైఖరికి వత్తాసు పలుకుతున్నారు. దీంతో ఉద్యోగస్తులు మెజారిటీ ఏ ప్రభుత్వాన్ని ఎంచుకుంటారు అన్న విషయం హాట్ టాపిక్ గా మారింది.



 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :