ASBL NSL Infratech

యువత తలచుకుంటే మార్పు ఎందుకు రాదు? : పవన్ కల్యాణ్

యువత తలచుకుంటే మార్పు ఎందుకు రాదు? : పవన్  కల్యాణ్

వైసీపీ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దాం కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. రాజంపేటలో నిర్వహించిన టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి సభలో పవన్‌ మాట్లాడారు. రాజ్యాధికారం కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉంది ఇది మారాలి. సారా వ్యాపారం చేసుకునే మిథున్‌ రెడ్డి నన్ను ఓడిస్తారట. యువత తలచుకుంటే మార్పు ఎందుకు రాదు? పెద్దిరెడ్డి, మిథన్‌ రెడ్డిని ఎదుర్కొనే గుండెబలం యువతకు లేదా? ఉపాధి అవకాశాలు లేక యువత  రోడ్లపై తిరుగుతున్నారు. సంపదంతా పెద్దిరెడ్డి, ఆయన సోదరుడు, కుమారుడు మిథన్‌ రెడ్డి వద్దే ఉండిపోయింది. అన్నమయ్య డ్యామ్‌ ప్రమాదంలో ఉందని ముందే హెచ్చరించారు. డ్యామ్‌లో ఇసుక తోడేయడం వల్ల 39 మంది చనిపోయారు. డ్యామ్‌లు కొట్టుకుపోతున్నా పెద్దిరెడ్డి, మిథన్‌ రెడ్డి పట్టించుకోరు. ప్రశాంతంగా కూర్చుని మద్యం వ్యాపారం చేసుకుంటున్నారు. రాజంపేట ప్రాంతానికి పరిశ్రమలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ముఠా నేతలు రూ.10 వేల కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టారు. ఈ ప్రాంతంలో రౌడీయిజం, ఫ్యాక్షనిజాన్ని పెద్దిరెడ్డి తీసుకొచ్చారు అని విమర్శించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :