ASBL NSL Infratech

నెవ‌ర్ బిఫోర్ అనేలా క‌ల్కి ఫ‌స్ట్ సింగిల్

నెవ‌ర్ బిఫోర్ అనేలా క‌ల్కి ఫ‌స్ట్ సింగిల్

ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పాన్ వ‌ర‌ల్డ్ సినిమా క‌ల్కి 2898ఏడి. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా జూన్ 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీపికా ప‌దుకొణె, దిశా ప‌టానీ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ సినిమాను అశ్వినీద‌త్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా  కోసం నాగ్ అశ్విన్ స‌రికొత్త ప్ర‌పంచాన్ని క్రియేట్ చేశాడు.

ఫ్యూచ‌ర్ ప్రపంచాన్ని ఫిక్ష‌న‌ల్ గా చూపించ‌బోతున్నాడు నాగ్ అశ్విన్. ఈ నేప‌థ్యంలో ఇండియ‌న్ ఫ‌స్ట్ ఫ్యూచ‌రిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా క‌ల్కి ఉండ‌బోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ సింగిల్ ను రిలీజ్ చేయ‌డానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. సంతోష్ నారాయ‌ణ‌న్ అందించిన సంగీతం ఎలా ఉంటుందో అని విన‌డానికి ఆడియ‌న్స్ కూడా ఎంతో ఆస‌క్తిగా ఉన్నారు.

ప్ర‌భాస్, దిశామీద తెర‌కెక్కించిన ఈ సాంగ్ గ్రాండ్ స్కేల్ పై విజువ‌ల్ ట్రీట్ తో ఉండ‌బోతుంద‌ని తెలుస్తోంది. సాంగ్ లోనే నాగ్ అశ్విన్ ఓ కొత్త లోకాన్ని చూపిస్తాడ‌ని చిత్ర యూనిట్ స‌భ్యులంటున్నారు. క‌ల్కి ఫ‌స్ట్ సింగిల్ క‌చ్ఛితంగా నెవర్ బిఫోర్ అనేలా ఉండ‌టం గ్యారెంటీ అంటున్నారు. ఇప్ప‌టికే క‌ల్కి నుంచి రిలీజైన కంటెంట్ ఆడియ‌న్స్ లో అంచ‌నాల‌ను పెంచ‌గా, త్వ‌ర‌లో రిలీజ్ కాబోయే ఫ‌స్ట్ సింగిల్ కూడా ఎవ‌రూ ఊహించని రీతిలో ఉండ‌బోతుందంటున్నారు.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :