రవితేజ కోసం పాత సినిమా టైటిల్
పాత సినిమాల టైటిల్స్ ను వాడుకోవడం కొత్తేమీ కాదు. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న తమ్ముడు, సుందరకాండ లాంటి సినిమాలన్నీ అదే కేటగిరీలోకి వస్తాయి. తాజాగా మాస్ మహారాజా రవితేజ, అనుదీప్ కాంబోలో వస్తున్న సినిమా కోసం అలాంటి టైటిల్ నే తీసుకున్నట్లు అప్డేట్ వినిపిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించబోయే ఎంటర్టైనర్ కు దాదాపు ఇది ఫిక్స్ అయినట్లేనని టాక్.
1992లో మోహన్ బాబు హీరోగా దొంగ పోలీస్ సినిమా వచ్చింది. ఆ తర్వాత 2013లో నిఖిల్ హీరోగా ఇంకో దొంగ పోలీస్ వచ్చింది కానీ అది ఆడియన్స్ దృష్టికి రానంతగా ఫ్లాప్ అయింది. తిరిగి ఇన్నేళ్ల తర్వాత మాస్ రాజా కోసం వాడుతున్నారు. జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ తర్వాత శివ కార్తికేయన్ తో ప్రిన్స్ సినిమా చేసిన అనుదీప్ ఇప్పుడు రవితేజతో సినిమా చేసి మంచి హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.
ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న రవితేజ ఆ తర్వాత ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్ల తెలుస్తోంది. ఇప్పటికే రవితేజ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో సినిమాలు చేశాడు. ధమాకా నుంచి వీరి మధ్య బాండింగ్ బాగా బలపడింది. స్పీడ్ విషయంలో రవితేజ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడు. గత కొన్ని సినిమాలుగా డిజాస్టర్లు అందుకున్న రవితేజకు మిస్టర్ బచ్చన్ అయినా మంచి ఫలితాన్నిస్తుందేమో చూడాలి.