ASBL NSL Infratech

రోజమ్మకు గడ్డుకాలమేనా...?

రోజమ్మకు గడ్డుకాలమేనా...?

వైసీపీ ఫైర్ బ్రాండ్, మంత్రి రోజాకు గడ్డుకాలం తప్పదా..? ప్రస్తుత పరిస్థితులు చూస్తే అలానే అనిపిస్తోంది. ఆమె ఓటమే తమ థ్యేయమంటూ వ్యతిరేకులు పంతం పట్టారు. ఇన్నాళ్లు పార్టీలో ఉండి రాజకీయాలు చేసిన వారు..ఇప్పుడు నేరుగా ప్రకటనలు సైతం చేశారు. అధినేత జగన్ తమ మాటలు పట్టించుకోకపోవడంతో ... రోజాపై డైరెక్టు యుద్ధం ప్రకటించేశారు. అయినా సీఎం జగన్, మంత్రి రోజా ఎందుకంత ధీమాగా ఉన్నారంటే.. పార్టీ సింబల్ ను చూసి ఓటేస్తారన్నది వారి విశ్వాసంగా కనిపిస్తోంది. ఎందుకంటే వైసీపీ అంటే జగన్. జగన్ అంటే వైసీపీ అన్న పరిస్థితి ఉంది కాబట్టి..

అయితే .. రాజీనామాలు చేసిన వారిని తక్కువగా చూడాల్సిన సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే గతంలో వీరు రోజా గెలుపుకోసం చిత్తశుద్ధితో పనిచేశారు. గెలిచిన తర్వాత రోజా వైఖరి మారడంతోనే వీరు.. ఆమె వ్యతిరేక వైఖరి తీసుకున్నారు. ఇప్పుడు ఆమెను ఓడించడమే లక్ష్యమంటున్నారు. దీనికి ఎంతవరకైనా వెళ్తామని స్పష్టం చేస్తున్నారు. వీరిలో కొందరికి మంత్రిపెద్దిరెడ్డి ఆశీస్సులు ఉండడంతో... రోజాకు ఈసారి గడ్డుపరిస్థితి తప్పదంటున్నారు. అలా అని మంత్రి పెద్దిరెడ్డిని కాదని సీఎం జగన్ ఆ జిల్లాలో కఠిన చర్యలు తీసుకోవడం కూడా కష్టమేనని చెప్పొచ్చు. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి హవా అలాంటిది మరి.

అలా అని రోజా ఏమైనా భారీ మెజార్టీతో గెలిచారా అంటే అదీ కాదు... రెండుసార్లు స్వల్పమెజారిటీతోనే గట్టెక్కారు. అలాంటి పరిస్థితుల్లో ఓవైపు కూటమి అభ్యర్థి గాలి భానుప్రకాశ్ పై పోరు సాగించాలి. ఇదే సమయంలో ప్రత్యర్థులుగా మారిన స్వపక్షనేతలను తట్టుకుని ముందుకు సాగాలి. ఎంత జగన్ అండ ఉన్నా.. ఈ పరిస్థితుల్లో రెండింటినీ ఎదుర్కొంటూ ముందుకు సాగడం రోజమ్మకు కష్టమేనని చెబుతున్నారు స్థానికులు. మరీ ముఖ్యంగా నగరిలో అంతా రోజా కనుసన్నల్లోనే జరుగుతోందని.. మిగిలిన నేతలు ఉత్సవ విగ్రహాల్లా మారడం కూడా దీనికి ఓ కారణమని వివరిస్తున్నారు.

బయట ప్రకటనలు వేరు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరంటున్నారు అసమ్మతి నేతలు. ఈ విషయం హైకమాండ్ తో పాటు మంత్రి రోజాకు అర్థమయ్యేలా చేస్తామంటున్నారు. తమను తక్కువ చేసి మీడియా చూపిస్తోందని, రాజకీయంగా తమ స్థాయి ఏంటో అందరికీ ఈ ఎన్నికలతో అర్థమవుతుందంటున్నారు. మరోవైపు...పార్టీ నుంచి బయటకు వెళ్లినా వీరికి మంత్రి పెద్దిరెడ్డి ఆశీస్సులు మాత్రం దండిగానే ఉంటాయని చెబుతున్నారు. ఎందుకంటే వీరు మంత్రిపెద్దిరెడ్డికి అనుంగు శిష్యులు మరి..ఇన్నాళ్లు తమవర్గంగా ఉన్నవారిని మంత్రి మాత్రం ఎలా వదిలేసుకుంటారన్నది టాక్.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :