ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

పుతిన్ ద రూలర్

పుతిన్ ద రూలర్

రష్యా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి వ్లాదిమిర్ పుతిన్ ఘన విజయం సాధించారు. ఎన్నికల పోలింగ్ లో .. పుతిన్‌కు దాదాపు 88 శాతం ఓట్లు లభించినట్లు తెలుస్తోంది. ఆయన పోటీదారులెవరూ ఒక్కొక్కరు 5 శాతం ఓట్లను దాటలేకపోయారని ది మిర్రర్ నివేదించింది. దీంతో రికార్డు స్థాయిలో పుతిన్ ఐదవసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఫలితంగా పుతిన్...జోసెఫ్ స్టాలిన్ తర్వాత ఎక్కువ కాలం కొనసాగిన రష్యా అధ్యక్షుడిగా నిలవనున్నారు.

అధ్యక్షుడిగా విజయం సాధించిన తర్వాత పుతిన్.. ఓటు వేయడానికి వచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ఫలితాలు రష్యన్ సమాజం ఏకీకృతం కావడానికి, బలంగా మారడానికి దోహదం చేస్తుందన్నారు. సైన్స్, టెక్నాలజీ వంటి వివిధ రంగాలలో దేశం ఇటీవల సాధిస్తున్న పురోగతిని పుతిన్ ప్రధానంగా ప్రస్తావించారు. అలాగే రష్యా సైన్యం అందిస్తున్న సేవలకు వారికి ధన్యవాదాలు తెలిపారు. రష్యాను అధిగమించాలని ఎవరు భావించినా, విఫలం కాక తప్పదన్నారు పుతిన్.

రష్యా, నాటో మధ్య వివాదం... మూడో ప్రపంచ యుద్ధానికి అడుగు దూరంలో ఉన్న వాస్తవానికి దారి తీస్తుందన్నారు అధ్యక్షుడు పుతిన్. మూడో ప్రపంచ యుద్ధం ఊహించిన దాని కంటే వేగంగా రాగలదని.. అయితే ఎవరూ దానిపై ఆసక్తి చూపడం లేదని అన్నారు. ఉక్రెయిన్‌లో సైన్యాన్ని మోహరించవద్దని నాటో దేశాలకు...గతంలోనే పుతిన్ హెచ్చరిక జారీ చేశారు. అటువంటి చర్య రష్యా అణుయుద్ధం వైపు మళ్లడానికి పునాది వేయగలదని ఆయన స్పష్టం చేశారు. రష్యా సార్వభౌమాధికారాన్ని రక్షించడానికి అవసరమైతే, అణ్వాయుధాలను ఉపయోగించడానికి తాను సిద్ధంగా ఉంటానని ప్రత్యేక ప్రకటనలో పుతిన్ తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :