ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

డొనాల్డ్ ట్రంప్ ను విచారించొచ్చా.. లేదా? వాదనలు ఆలకించనున్న సుప్రీంకోర్టు

డొనాల్డ్ ట్రంప్ ను విచారించొచ్చా.. లేదా? వాదనలు ఆలకించనున్న సుప్రీంకోర్టు

2020 నాటి దేశాధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో అనుచితంగా జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలకు సంబంధించి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను విచారించొచ్చా లేదా అనే అంశాన్ని తేల్చేందుకు అమెరికా సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ వ్యవహారంలో ఏప్రిల్‌ నుంచి వాదనలు ఆలకించనున్నట్లు తెలిపింది. ఈ లెక్కన జూన్‌ చివరికల్లా తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నాయి. అయితే ట్రంప్‌ విచారణార్హుడే అని తీర్పు వచ్చినా ఆ తర్వాత ఆయన్ను విచారించే ప్రక్రియ ఈ ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల కంటే ముందు ముగుస్తుందా అన్నది అనుమానమే. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ కొన్ని రాష్ట్రాల్లో ఈ ఏడాది సెప్టెంబరులోనే ప్రారంభం కానున్న సంగతి గమనార్హం. ఎన్నికలు ముగిసేదాకా విచారణను నిలిపివేయాలంటూ ట్రంప్‌ తరపు న్యాయవాదులు కోర్టును కోరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :