పొట్టి పేర్లతో వచ్చే ప్రయాణికులపై నిషేధం : యూఏఈ

పొట్టి పేర్లతో వచ్చే ప్రయాణికులపై నిషేధం : యూఏఈ

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం అరబ్‌ దేశాలకు వెళ్లే వ్యక్తుల పాస్‌పోర్ట్‌లు కేవలం ఇంటి పేర్లు లేదా సంక్షిప్త నామాలతో (ఏక పదం) ఉంటే ఇకపై అనుమతించరు. యూఏఈ ఇమిగ్రేషన్‌ అధికారులు ఇటువంటి వ్యక్తులను అనుమతిచరని, వారిని అనుమతి నిరాకరించిన ప్రయాణికులు (ఐఎన్‌ఏడీ)గా పరిగణిస్తారని ఆ మార్గదర్శకాల్లో పేర్కొన్నట్టు ఎయిరిండియా ఓ ప్రకటన జారీ చేసింది. నవంబరు 21వ తేదీతో ఉన్న ఈ ప్రకటన ప్రకారం అలా పొట్టి పేర్లతో వచ్చే ప్రయాణికులకు  టూరిస్టు లేదా మరే రకమైన వీసాలు జారీ కావు. ఒక వేళ గతంలో వీసా పొంది ఉన్నా ,అనుమతి నిరాకరించిన ప్రయాణికులుగానే ఇమిగ్రేషన్‌ అధికారులు పరిగణిస్తారు. ఆ మార్గదర్శకాలు వెంటనే అమల్లోకి వచ్చాయి.  ఈ కొత్త నామ విధానం చెల్లుబాటయ్యే నివాస అనుమతి, వర్క్‌ వీసాలు ఉన్నవారికి వర్తించదు.

 

Tags :