అమెరికాలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణోత్సవం!

అమెరికాలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణోత్సవం!

ఓం నమో వేంకటేశాయ!
అమెరికాలో ఉంటున్న భక్త మహాశయులకు శుభవార్త!!!
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణోత్సవం!

టీటీడీ వారి శ్రీనివాస కళ్యాణోత్సవం - ఆంధ్రప్రదేశ్‌ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మార్గదర్శకత్వంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌) అమెరికాలోని ఎనిమిది (08) నగరాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని కన్నులపండుగలా నిర్వహించడానికి సమన్వయ సన్నాహాలు చేస్తుంది. ఇందుకోసం ఆయా నగరాల్లో ధార్మిక, సేవా సంస్థల కార్యనిర్వాహక వర్గం పెద్దయెత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. తిరుమల నుంచి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి మూర్తులను అమెరికా తీసుకొస్తారు. తిరుమల శ్రీవారి దేవస్థానం నుండి వచ్చే అర్చకులు, వేద పండితులు వైఖానస ఆగమం ప్రకారం శ్రీవారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ శ్రీ వైవీ సుబ్బారెడ్డి దంపతులు కూడా పాల్గొంటారు. స్వయంగా తిరుమల నుంచి తెప్పించిన లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు అందజేస్తారు.

కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవంలో పాల్గొనండి...

దేవ దేవుడి కృపకు పాత్రులుకండి.

 

Tags :