ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

2022 లో ఫుల్ గా ట్రోలింగ్ చేయబడిన టాలీవుడ్ మూవీస్...

2022 లో ఫుల్ గా ట్రోలింగ్ చేయబడిన టాలీవుడ్ మూవీస్...

2022 కంప్లీట్ అయ్యి న్యూ ఇయర్ లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. ఈ సంవత్సరంలో  తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి వందల కొద్ది సినిమాలు వచ్చాయి. ఎప్పటిలాగే చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సొంతం చేసుకోగా, చాలా సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి. మరికొన్ని సినిమాలు వందల కోట్ల నష్టాలను చవి చూసి, ప్రేక్షకులని నిరాశ పరిచాయి.

బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిన సినిమాల్లో కొన్ని సినిమాలు దారుణమైన సోషల్ మీడియా ట్రోల్స్ ను ఎదుర్కొన్నాయి. కలెక్షన్స్ విషయంలో పర్వాలేదు అనిపించుకున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన ట్రోల్స్ కు గురి అయ్యాయి. ఈ ఏడాది విడుదల అయిన సినిమాల్లో అత్యధికంగా ట్రోల్స్ కి గురి అయిన సినిమా "సన్నాఫ్ ఇండియా".

ఈ సినిమాలో మోహన్ బాబు హీరోగా నటించిన విషయం తెల్సిందే. ఈ సినిమాలోని వీఎఫ్ఎక్స్ మొదలుకుని ప్రతి ఒక్క సీన్ ని కూడానెటిజన్స్ వదలలేదు. సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోల్స్ చేశారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన సన్నాఫ్ ఇండియా సినిమా కలెక్షన్స్ విషయంలో కూడా ట్రోల్స్ ఎదురయ్యాయి.

మంచు విష్ణు హీరోగా వచ్చిన "జిన్నా" సినిమా కూడా దారుణంగా నిరాశపరచడంతో కూడా విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ఈ సినిమాలో సన్నీ లియోన్ మరియు పాయల్ రాజ్ పుత్  నటించినా కూడా నిరాశ పర్చడంతో జిన్నా సినిమా ను పెద్ద ఎత్తున విమర్శించిన వారు చాలా మంది ఉన్నారు.

ప్రభాస్ నటించిన "రాధే శ్యామ్" సినిమా కూడా దారుణమైన ట్రోల్స్ ను ఎదుర్కొంది. టైటానిక్ రేంజ్ లో క్లైమాక్స్ ప్లాన్ చేశాం అన్నారు. ఇదేంటీ అంటూ సోషల్ మీడియాలో దర్శకుడిపై మాత్రమే కాకుండా ప్రభాస్ మరియు హీరోయిన్ పూజా హెగ్డే పై కూడా తీవ్రంగా ట్రోల్ల్స్ వచ్చాయి. ఈ ఏడాది విడుదల అయిన సినిమాల్లో "ఆచార్య", రవితేజ నటించిన "రామారావు ఆన్ డ్యూటీ" సినిమాలు కూడా సోషల్ మీడియాలో విమర్శల పాలు అయ్యాయి.

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన "లైగర్" సినిమా డిజాస్టర్ అవ్వడంతో ట్రోల్స్ ఏ స్థాయిలో వచ్చాయో తెల్సిందే. ముఖ్యంగా విజయ్ దేవరకొండ యొక్క నత్తి గురించి రకరకాలుగా ట్రోల్స్ వచ్చాయి. ట్రోల్స్ ఎదుర్కొన్న సినిమాలు కొన్ని అయితే అదే సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కించుకున్న సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ ట్రోల్స్ ను దృష్టిలో పెట్టుకుని ఫిల్మ్ మేకర్స్ 2023 లో అయినా మంచి సినిమాలతో వస్తారని ఆశిద్దాం.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :