ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

టైమ్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్‌పో 2023..: హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ ఎక్సలెన్స్‌కు వేదిక..!!

టైమ్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్‌పో 2023..: హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ ఎక్సలెన్స్‌కు వేదిక..!!

-ఎక్స్‌పోను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వ MA & UD, పరిశ్రమలు & IT, E&C శాఖా మంత్రి కేటీఆర్‌

టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ‘టైమ్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్‌పో’ మూడవ ఎడిషన్‌ శనివారం హైటెక్స్ ఎగ్జిబిషన్‌ సెంటర్‌(హాల్ నెం.3) వేదికగా ప్రారంభమైంది. 2 రోజుల పాటు కొనసాగే ఈ మెగా ఎక్స్‌పోను తెలంగాణ ప్రభుత్వ MA & UD, పరిశ్రమలు & IT, E&C శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో TS-AP రెస్పాన్స్ హెడ్ కమల్‌ క్రిష్ణణ్‌ పాల్గొన్నారు. ఈ ప్రీమియర్ రియల్ ఎస్టేట్ కార్యక్రమం ప్రాపర్టీ కొనుగోళ్ల విధి విధానాలను పునర్నిర్వచించడంతో పాటు గృహాలను కోరుకునేవారికి, ఔత్సాహిక పెట్టుబడిదారులకు విస్తృతమైన అవకాశాలను అందించే వేదికగా కొనసాగుతుంది. ఈ టైమ్స్ ప్రాపర్టీ మెగా ఎక్స్‌పో రియల్ ఎస్టేట్ మహోత్సవం.., హైదరాబాద్‌లోని అత్యుత్తమ ఆస్తులను ప్రదర్శించడంలో భాగంగా అపర్ణా కన్‌స్ట్రక్షన్స్, హానర్ హోమ్స్, రాజపుష్ప ప్రాపర్టీస్, మై హోమ్ గ్రూప్‌తో సహా ప్రఖ్యాత డెవలపర్లను భాగస్వామ్యం చేస్తూ అద్భుత వేదికను ఏర్పాటు చేసింది. 

ఈ సందర్భంగా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ, "రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో హైదరాబాద్‌ మహానగరం 45-50 శాతం ప్రాతినిథ్యం వహిస్తుందని, ఇందులో ఇక్కడి రియల్‌ ఎస్టేట్‌ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఈ ప్రాపర్టీ ఎక్స్‌పోలో పాల్గొన్న బిల్డర్లు ‘వినూత్న డిజైన్‌లతో, గ్రీన్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా, ఎలివేషన్-అధునాతన ఇంటీరియర్‌లను దృష్టిలో ఉంచుకుని మంచి నాణ్యమైన భవనాలను నిర్మించాలని ప్రత్యేకంగా కోరారు. అంతేకాకుండా హైదరాబాద్‌ పశ్చిమ భాగంలోనే కాకుండా నగర నలుమూలలా ఇతర ప్రాంతాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. 

ఈ మెగా ఎక్స్‌పో నేపథ్యంలో టైమ్స్ ఆఫ్ ఇండియా, TS-AP రెస్పాన్స్ హెడ్ కమల్ కృష్ణన్ తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ.,  టైమ్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్‌పో ప్రారంభోత్సవానికి శ్రీ కె.టి. రామారావు గారు హాజరుకావడం, దీనికి అన్ని విభాగాల నుంచి అద్భుతమైన స్పందన లభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ‘టైమ్స్ ప్రాపర్టీ మెగా ఎక్స్‌పో 2023’ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై పెరుగుతున్న ఆసక్తి, నమ్మకం, విశ్వాసాలను ప్రతిబింబిస్తుంది. ఈ కార్యక్రమంలో కొనుగోలుదారులు, అమ్మకందారులను అనుసంధానం చేయడమే కాకుండా రియల్టీ పరిశ్రమలో విలువైన అంతర్దృష్టులను అందించే సమాచార వేదికగా నిలిచిందని అన్నారు. ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ వ్యాపారుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్‌పోలో పెద్ద సంఖ్యలో ప్రజల పాల్గొనడం, రియల్టర్లు ఉత్సాహాంగా తమ సేవలను ప్రదర్శించడం గొప్ప అనుభూతని అన్నారు. వాక్-ఇన్‌లు. ఈ విజయంతో తాము చాలా సంతోషంగా ఉన్నామన్నారు. ఈ రంగంలో ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ, రియల్ ఎస్టేట్ మరింత ఉత్సాహంతో ముందుక సాగుతూ తన పటిష్టతను నిరూపించుకుంటుందని వివరించారు. 

ఈ ఎక్స్‌పో డెవలపర్ల ఆకట్టుకునే అంశాలు, భవిష్యత్‌ ప్రాజెక్టుల ప్రదర్శనలతో విభిన్న స్థాయిల ఆర్థిక పరమైన ప్రాధాన్యతలకు వేదికగా నిలిచింది. ఈ షోకు హజరైనవారిక విలాసవంతమైన విల్లాలు మొదలు ఉల్లాసవంతమైన అపార్ట్‌మెంట్‌లు, నిర్మలమైన ప్లాట్‌ల వరకు వారి కలల సౌదాన్ని ఎంచుకునే అవకాశాలను కల్పించింది. 

ఎక్స్‌పోలో నెట్‌వర్కింగ్ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి., పరిశ్రమ నిపుణులు, సాటి కొనుగోలుదారులు మరియు పెట్టుబడిదారులతో అతిపెద్ద రియల్‌ మహోత్సవాన్ని రూపొందించింది. ప్రతీ గంటకు లక్కీ డ్రా రూపంలో బహుమతులను అందించడం ఈ వేదికలో హైలెట్‌గా నిలిచింది. ఇలాంటి ఆసక్తికర అంశాలు రియల్‌ ఔత్సాహికుల ఆసక్తిని పెంచడంతో పాటు ఎక్స్‌పోలో భవిష్యత్‌ ప్రణాళికలకు నూతన ఆశలను నెరవేర్చుతుంది. 

టైమ్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్‌పో 2023 అసమానమైన విజయాన్ని సాధించింది, రియల్ ఎస్టేట్ అవకాశాలకు హాట్‌స్పాట్‌గా హైదరాబాద్ స్థానాన్ని పునరుద్ఘాటించింది. రియల్ ఎస్టేట్ రంగంలో విశేష అభివృద్ధి చెందుతున్నందున, ఈ ఎక్స్‌పో ఆవిష్కరణలు, నూతన ట్రెండ్‌లను అన్వేషించడంలో ముందంజలో కొనసాగుతోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :