విదేశాల నుంచి వచ్చేవారిని నేటి నుంచి తప్పనిసరి : డీహెచ్ శ్రీనివాస్ రావు

విదేశాల నుంచి వచ్చేవారిని నేటి నుంచి తప్పనిసరి  : డీహెచ్ శ్రీనివాస్ రావు

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసుల నమోదపై అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌) డాక్టర్‌ శ్రీనివాస్‌రావు తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత్‌లో ఇప్పటి వరకు ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాలేదని, దక్షిణాఫ్రికా, బోట్స్‌వానాలో ఉన్నాయని తెలిపారు. కొత్త రకమైన కేసులు వస్తే ప్రభుత్వమే నేరుగా ప్రకటిస్తుందని తెలిపారు. ఆరోగ్యశాఖ అధికారులను ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు. ఒమిక్రాన్‌ కేసుల నేపథ్యంలో 12 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు ఉన్నాయన్నారు. విదేశాల నుంచి వచ్చేవారిని నేటి అర్థరాత్రి నుంచి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పరీక్షల్లో పాజిటివ్‌ నిర్ధారణ అయినవారిని ఆస్పత్రికి తరిలిస్తామన్నారు.

ఒమిక్రాన్‌ కేసులు  గుర్తించిన 12 దేశాల నుంచి 40 మందికి పైగా రాష్ట్రానికి వచ్చారని, వారందరికి నెగటివ్‌ రావడంతో హోం క్వారంటైన్‌కి పంపామని తెలిపారు. వారి ఆరోగ్యాన్ని 14 రోజులు గమనిస్తామని తెలిపారు. ఒమిక్రాన్‌కు డెల్టా 6 శాతం వేగంగా వ్యాపిస్తున్నట్లు గుర్తించారని కానీ వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటోందన్నారు. ఎన్ని మ్యుటేషన్లు వచ్చినా కొవిడ్‌ నిబంధనలను పాటిస్తే మనల్ని మనం కాపాడుకోవచ్చన్నారు.

 

Tags :