ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

నాడు కేసీఆర్.. నేడు రేవంత్ రెడ్డి..! మోదీపై సేమ్ టు సేమ్..!!

నాడు కేసీఆర్.. నేడు రేవంత్ రెడ్డి..! మోదీపై సేమ్ టు సేమ్..!!

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ఘనస్వాగతం పలికారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో వాళ్లిద్దరూ కూడా పాల్గొన్నారు. తెలంగాణకు సంపూర్ణ సహకారాలు అందిస్తామని మోదీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రధాని మోదీ పెద్దన్న లాంటి వారని.. కేంద్రం నుంచి తెలంగాణకు సంపూర్ణ సహకారాన్ని ఆశిస్తున్నామని ప్రకటించారు. మోదీకి అనుకూలంగా రేవంత్ రెడ్డి స్టేట్ మెంట్లు ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

అభివృద్ధి కోసం కేంద్రంతో పని చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామన్నారు రేవంత్ రెడ్డి. ప్రధాని మోదీతో వేదికలు పంచుకునేందుకు ఇబ్బంది లేదన్నారు. సమాఖ్య స్ఫూర్తిని గౌరవిస్తూ ఆత్మగౌరవంతో ముందుకెళ్తామన్నారు. పార్టీల పరంగా కొట్లాడతామని.. అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి కామెంట్స్ విన్న ప్రతి ఒక్కరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. రేవంత్ రెడ్డి ఎంతో పరిణతితో వ్యవహరించారని చెప్పుకొస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం సహకారం ఎంతో అవసరమని.. అలాంటప్పుడు పార్టీల పరంగా విభేదాలను పక్కన పెట్టి పనిచేయడంలో తప్పు లేదని అభిప్రాయపడుతున్నారు.

గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మోదీతో కలిసి వేదిక పంచుకునేందుకు ఆసక్తి చూపలేదు. మొదటి విడతలో మోదీతో కలిసి చెట్టపట్టాల్ వేసుకుని తిరిగిన కేసీఆర్.. రెండో టర్మ్ లో మాత్రం బీజేపీపై యుద్ధం ప్రకటించారు. కనీసం ప్రోటోకాల్ కూడా పాటించలేదు. మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడు కనీసం స్వాగతం కూడా పలకలేదు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఇది విమర్శలకు దారితీసింది. కేసీఆర్ అహంకారంతో వ్యవహరిస్తున్నారని.. రాష్ట్రానికి ఇది మంచిది కాదని సూచించారు. అయినా కేసీఆర్ ఏనాడూ పట్టించుకోలేదు. దీంతో ఆయన వ్యవహారశైలిపై అనేక విమర్శలు వచ్చాయి.

ఇప్పుడు రేవంత్ రెడ్డి పార్టీని పక్కన పెట్టి అభివృద్ధి కోసం ప్రధానితో మోదీతో కలిసి వేదిక పంచుకోవడం.. ప్రోటోకాల్ పాటించడంపై అభినందనలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ ను కేసీఆర్ తో పోల్చిచూస్తున్నారు. కేసీఆర్ కూడా మొదట్లో ఇలాగే వ్యవహరించారని.. ఆ తర్వాత పట్టించుకోలేదని.. రేవంత్ కూడా అలా చేయకుండా కలిసి ముందుకు సాగాలని సూచిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి పని చేయడంలో తప్పులేదని చెప్తున్నారు. మరి చూడాలి.. మున్ముందు ఏం జరుగుతుందో.!

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :