ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

యాక్టర్ ఫామిలీ టు డాక్టర్ ఫామిలీ : ఆలీ కూతురి పెళ్లి...

యాక్టర్ ఫామిలీ టు డాక్టర్ ఫామిలీ : ఆలీ కూతురి పెళ్లి...

టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీ ఇటు సినిమాలతో అటు టీవీ షోస్ తో బిజీ గా ఉన్న విషయం తెలిసిందే. దశాబ్దాలుగా కామెడీ తో ఆలీ తెలుగు చిత్ర పరిశ్రమని ఏలుతునే ఉన్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబ వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. తన కుమార్తె పెళ్లి ఏర్పాట్ల హడావిడిలో ఉన్నారు.

రీసెంట్ గా ఆలీ గుంటూరు లోని అన్వయ కోవెన్షన్స్ లో తన పెద్ద కుమార్తె వివాహం మరియు రిసెప్షన్ ని గ్రాండ్ గా నిర్వహించారు. అయితే ఆలీ ఇంటి అల్లుడు, వారి కుటుంబ సభ్యుల వివరాలు ఏవి బయటకు రాలేదు.

అభిమానుల ఆరాల ప్రకారం తెలిసిన విషయాలేంటంటే..అల్లుడు షేక్ షెహయాజ్ ఉన్నత విద్యావంతుల కుటుంబానికి చెందిన యువకుడు. చదువుల్లో ఎప్పుడు ముందుండేవాడు. ఆయన ఎంబిబిఎస్ చదివి డాక్టర్ గా స్థిరపడ్డారు.

ఆలీ కూతురు ఫాతిమా కూడా ఇటీవలే ఎంబిబిఎస్ చదువుని పూర్తి చేసుకుంది. దీంతో కూతురికి పెళ్లి చేయాలనుకున్న ఆలీ డాక్టర్ సంబంధం కోసమే వెతికారట. ఈ క్రమంలో ఈ పెళ్లి సంబంధం కుదిరినట్టు తెలిసింది.

వరుడి కుటుంబం లండన్ లో కొన్ని సంవత్సరాలుగా నివసిస్తున్నారు. వారి మూలాలు గుంటూరు లో ఉన్నాయి అని సన్నిహితుల సమాచారం. ఆలీ కూతురు మరియు అల్లుడు ఇద్దరు కూడా డాక్టర్స్ అవ్వడం వల్ల, త్వరలోనే ఇద్దరు కలిసి ఒక కొత్త హాస్పిటల్ ని ఏర్పాటు చేసి ప్రజలకి సేవ చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

ఈ పెళ్ళికి మెగాస్టార్ దంపతులు హాజరు కాగా, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ సహా టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. వీరిలో అల్లు అరవింద్, హీరో రాజశేఖర్, బ్రహ్మానందం, మంచు విష్ణు ,బోయపాటి శీను తదితరులు ఉన్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :