ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

సంక్రాంతి తర్వాత మొదలవుతున్న అసలైన షూటింగుల పండగ....

సంక్రాంతి తర్వాత మొదలవుతున్న అసలైన షూటింగుల పండగ....

దాదాపు 2022 ఇయర్ ఎండింగ్ కి వచ్చేసింది. కొద్దిమంది హీరోలు షూటింగుల్లో బిజీగా ఉండగా, మరికొందమంది ఫ్యామిలీ వెకేషన్స్ లో బిజీగా ఉన్నారు. కేవలం కొద్ది మంది హీరోలు మాత్రమే ఆన్ సెట్స్ లో బిజీగా ఉన్నారు. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ సహా వ్యక్తిగత కారణాలతో చాలా మంది హీరోలు ఇళ్లకే పరిమితమయ్యారు. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుని,  ఫ్రెష్ గా 2023 లోకి అడుగు పెట్టాలని భావిస్తున్నారు టాలీవుడ్ హీరోలు. 

ఈ నేపథ్యంలో కమిట్ అయిన సినిమాలు కూడా ప్రారంభించలేదు మన స్టార్స్. కొంత మంది లాంచ్ చేసి షూటింగ్ కి వెళ్లలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రౌడీ విజయ్ దేవరకొండ ఇలా అందరు స్టార్ హీరోలు బ్రేక్ లోనే  ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా ఎస్ ఎస్ ఎంబీ 28వ చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన మహేష్ సెట్స్ కి వెళ్లడం లేదు.

ఇటీవల కాలంలో ఆయన కుటుంబంలో జరిగిన వరుస మరణాల కారణంగా ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. 2023 జనవరి మొదటి వారం నుంచి సెట్స్ కు వెళ్లాలని నిర్ణయించారు.  అటుపై పండుగ తర్వాత ఏకంగా 60 రోజుల పాటు లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసారు. అప్పటి నుంచి మహేష్ నిరవధికంగా షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం.

అలాగే ఎన్టీఆర్ 30వ చిత్రం కూడా పండగ తర్వాతనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకి సంబంధించి అన్ని సిద్ధం చేసుకొని రెడీగా ఉన్నారు. అందుకే తారక్ బిజీ అవ్వడానికి ముందే ఫ్యామిలీతో లండన్ కి  వెకేషన్ కి వెళ్లారు. న్యూ ఇయర్ వేడుకలు కూడా అక్కడే జరపుకుని ఇండియాకి రానున్నారు. అటుపై సంక్రాంతి పండగలో బిజీ అవుతారు. తర్వాతే తన ౩౦ వ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేస్తారు.

ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప -2 షూటింగ్ కి సంక్రాంతి పండుగ తర్వాత జాయిన్ అవుతారు. ఆయనకు అత్తగారింట్లో సంక్రాంతి జరుపుకోవడం అలవాటు. మరి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కాబట్టి ఈ ఏడాది అలా ప్లాన్ చేస్తున్నాడా? లేక హైదరాబాద్ లో నే ఉంటాడా? అన్నది తెలియాలి. కానీ పండగ తర్వాత మాత్రం పుష్పరాజ్ అడవి  బాట పట్టనున్నాడు.

అలాగే రౌడీ స్టార్ విజయ్ దేరకొండ హీరోగా నటిస్తోన్న 'ఖుషీ' షూటింగ్ అర్ధంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. సమంత  అనారోగ్యానికి గురవ్వడంతో షూటింగ్ కి బ్రేక్ పడింది. మళ్లీ సంక్రాంతి తర్వాత తిరిగి ప్రారభించాలని శివ నిర్వాణ సన్నాహాలు చేస్తున్నాడు. ఇంకా పలువురు హీరోలు సైతం సంక్రాంతి తర్వాత కొత్త సినిమాలు పట్టాలెక్కించాలని చూస్తున్నారు. మొత్తానికి పండగ తర్వాత సెట్లో అంతకు మించిన పెద్ద పండగ వాతావరణం కనిపించబోతుందని చెప్పొచ్చు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :