2023లో HCA అవార్డ్స్! ఆర్ఆర్ఆర్ ఏకంగా 5 కేటగిరీల్లో అవార్డులు

HCA Awards 2023లో ఆర్ఆర్ఆర్ సినిమా జోరు చూపించింది. హాలీవుడ్ చిత్రాలను దాటి 5 కేటగిరీల్లో విజేతగా నిలవటం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వేడులకల్లో రాజమౌళితో పాటు రామ్ చరణ్ పాల్గొన్నారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. గత ఏడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.1200 కోట్లను వసూలు చేసి ఇండియా టాప్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ప్రపంచం దృష్టిలో పడింది. హాలీవుడ్‌లో ఆర్ఆర్ఆర్ తనదైన గుర్తింపును సంపాదించుకుంది. మేకింగ్, నటీనటుల నటన, రాజమౌళి టేకింగ్‌లపై హాలీవుడ్ టెక్నీషియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరో వైపు ఈ సినిమాలో ‘నాటు నాటు..’ సాంగ్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డ్స్‌కి ఎంపికైంది. మార్చి 12న ఫైనల్ రిజల్ట్‌ను అనౌన్స్ చేయబోతున్నారు. దీంతో ఎంటైర్ ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరో వైపు, ఇప్పటికే ఈ చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకున్న సంగతి తెలిసిందే. కాగా. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కీర్తి కిరీటంలో మరి కొన్ని అవార్డులు చేరాయి.
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో (HCA Awards 2023) ఈ చిత్రం ఏకంగా ఐదు కేటగిరీల్లో విజేతగా నిలవటం విశేషం. హాలీవుడ్ సినిమాలతో పోటీ పడి ఏకంగా 5 కేటగిరీల్లో విజేతగా ఆర్ఆర్ఆర్ సినిమాకు అవార్డులు రావటంపై ఇండియన్ సినీ ప్రేక్షకులు సంతోషాన్నివ్యక్తం చేస్తున్నారు. HCA Awards 2023 వేడుకల్లో డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌలి, హీరో రామ్ చరణ్‌లు పాల్గొన్నారు. చరణ్ అయితే అవార్డ్ ప్రెజంటర్‌గానూ మారారు. హాలీవుడ్ సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు అబ్బుర పరుస్తుంటాయి. అటాంటి చిత్రాలనే తలదన్ని ఈసారి ఆర్ఆర్ఆర్ బెస్ట్ యాక్షన్ మూవీగా, బెస్ట్ స్టంట్స్ కేటగిరీల్లో విజేతగా నిలిచింది. అలాగే నాటు నాటు సాంగ్ అయితే బెస్ట్ సాంగ్‌గా అవార్డును దక్కించుకుంది. ఇక ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలోనూ ఆర్ఆర్ఆర్ అవార్డును సొంతం చేసుకుంది. అలాగే స్పాట్ లైట్ అవార్డ్ కూడా ట్రిపులార్‌కే దక్కింది. మొత్తంగా చూస్తే HCA Awards 2023లో ఆర్ఆర్ఆర్‌కి 5 కేటగిరీల్లో అవార్డులు రావటంపై అందరూ హ్యపీగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ 1920 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఫిక్షనల్ పీరియాడిక్ మూవీ. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించారు. ఇంకా బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగణ్ సహా హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ సైతం కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. HCA అవార్డ్స్ 2023లో ఆర్ ఆర్ ఆర్ ఏకంగా 5 కేటగిరీల్లో అవార్డులను దక్కించుకోవటంతో ఎంటైర్ యూనిట్ ఆనందానికి అంతే లేదు. లెజండ్రీ నటులతో తారక్, తన పేర్లుండటంపై చరణ్ ట్వీట్ చేయగా, చరణ్‌ని అప్రిషియేట్ చేస్తూ ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. అందుకు కారణం ఆర్ ఆర్ ఆర్ సినిమా. గత ఏడాది వసూళ్ల పరంగా రికార్డులను క్రియేట్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు అవార్డుల రేసులో దూసుకెళ్తోంది. ఏకంగా హాలీవుడ్ చిత్రాలతోనే మన తెలుగు సినిమా పోటీపడటం తెలుగు వారిగా ఎంతో గర్వించాల్సిన సమయం. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకున్న ఆర్ ఆర్ ఆర్ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ సాంగ్ కేటగిరీలోనూ నామినేట్ అయిన సంగతి తెలిసిందే.
కాగా ఇప్పుడు మరో ఐదు అవార్డులను ఆర్ ఆర్ ఆర్ సినిమాసొంతం చేసుకోవటంతో తెలుగు వారి ఖ్యాతి విశ్వ వ్యాప్తమైందనే చెప్పాలి. హాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకమైన అవార్డులుగా ఒకటిగా భావించే HCA అవార్డ్స్ (హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్) రేసులో హాలీవుడ్ చిత్రాలకు మించి మన సినిమా సత్తాను చాటడం విశేషం. ఒకటి రెండు కాదు.. ఏకంగా ఐదు హెచ్‌సీఏ అవార్డులను దక్కించుకుంది ఆర్ఆర్ఆర్. ఈ అవార్డుల వేడుకలో రాజమౌళి, రామ్ చరణ్, ఎం.ఎం.కీరవాణి తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. ‘బెస్ట్ యాక్టర్స్ ఇన్ యాక్షన్ మూవీస్ నామినీస్‌లో లెజండ్రీ యాక్టర్స్ నికోలస్ కేజ్, టామ్ క్రూయిస్, బ్రాడ్ పిట్ వంటి వారి సరసన నాది, నా తమ్ముడు తారక్ కూడా నిలిచాం. వారితో పాటు మా పేర్లును స్క్రీన్‌పై చూసుకోవటం మరచిపోలేని అనుభూతి’ అని తెలియజేస్తూ నామినీస్ పేర్లున్న స్క్రీన్ ఫొటోను షేర్‌చేశారు చెర్రీ. మరో వైపు ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్ర సైతం రామ్ చరణ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. మెగా పవర్‌స్టార్‌ను ఏకంగా గ్లోబల్ స్టార్ అంటూ ఆకాశానికెత్తేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు దక్కుతున్న అవార్డులను, గుర్తింపును చూసి మెగా, నందమూరి ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
https://twitter.com/AlwaysRamCharan/status/1629384930441715712
https://twitter.com/AlwaysRamCharan/status/1629363065019039751
https://twitter.com/anandmahindra/status/1629362729889955840
https://twitter.com/DVVMovies/status/1629339203099295750
https://twitter.com/DVVMovies/status/1629369293774422016