ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

బాలీవుడ్ హిట్ అండ్ హాట్ పెయిర్ షారుఖ్, దీపికా...

బాలీవుడ్ హిట్ అండ్ హాట్ పెయిర్ షారుఖ్, దీపికా...

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, హాట్ హీరోయిన్ దీపికా పదుకొనె గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. 2007 లో స్టార్ట్ అయిన ఈ ఆన్ స్క్రీన్ పెయిర్ ఇప్పటికి ప్రేక్షకుల గుండెల్లో వేడి పుట్టిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఓం శాంతి ఓం తో మొదలై ఇప్పటి పఠాన్ వరకు ఎక్కడా తగ్గేదేలేదంటూ దూసుకుపోతుంది ఈ జంట. సూపర్ కెమిస్ట్రీ తో ఆడియన్స్ కి, ఫాన్స్ కి కనువిందు చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన పఠాన్ మూవీ తో మరోసారి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

2006 లో కన్నడ సినిమాతో తెరంగ్రేటం చేసింది అందాల భామ దీపికా పదుకొనె. 2007 లో ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ సుందరి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ సరసన జోడిగా నటించి అందరి చూపుని ఆకర్షించింది. ఇది మొదలు షారుఖ్ తో " చెన్నై ఎక్స్ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్ " వంటి సినిమాల్లో నటించి హిట్ పెయిర్ గా నిలిచారు. ఆన్ స్క్రీన్ పై వీరు పండించే కెమిస్ట్రీ కి ఫన్ కి ఫిదా అవ్వని వారు లేరు. చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా ఈ హిట్ పెయిర్ ఫన్ కి పరాకాష్ట అని చెప్పొచ్చు.

షారుఖ్, దీపికా కాంబోలో సినిమా వస్తుందంటే చాలు ఇటు ఆడియన్స్, అటు ఫాన్స్ అలెర్ట్ అవుతారు. బాలీవుడ్ క్రేజీ పెయిర్ గా అందరి అటెంషన్ ని తమ వైపుకి తిప్పుకున్నారు ఈ హీరో హీరోయిన్. పఠాన్ తో బాలీవుడ్ లో ఈ పెయిర్ కి ఉన్న క్రేజ్ మరోసారి ప్రూవ్ అయింది. పాండెమిక్ తర్వాత రిలీజైన బాలీవుడ్ సినిమాల్లో పఠాన్ సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. కేవలం దీపికా, షారుఖ్ తోనే ఇది సాధ్యమైందని సినీ వర్గాల్లో టాక్. ఇక మరోసారి షారుఖ్ తో కలిసి జవాన్ సినిమాలో కీలకమైన పాత్రలో మరొకసారి మెరవనుంది. మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఈ హిట్ పెయిర్ నటించి ప్రేక్షకులని కనువిందు చేయాలని కోరుకుందాం.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :