ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

సత్యం రాజేష్ కొత్త చిత్రం ప్రారంభం

సత్యం రాజేష్ కొత్త చిత్రం ప్రారంభం

సత్యం రాజేష్, రిహ, సునీత హీరో హీరోయిన్లుగా మధుసూదన్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి బిసి.వెల్ఫేయిర్ మరియు సివిల్ సప్లయిస్ మినిష్టర్ గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందించబడుతుంది. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుండి ప్రారంభం అయ్యింది.  సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, మధు నందన్, చమ్మక్ చంద్ర, తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ స్వరాలు సమకూరుస్తున్నారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్ గా భూపతి యాదగిరి ఆర్ట్ డైరెక్టర్ గా ఈ మూవీకి వర్క్ చేస్తున్నారు.మంచి కథ కథనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని రూపొందిందబడుతుంది. ఈ సినిమా టైటిల్ ను చిత్ర యూనిట్ త్వరలో తెలియజేయనున్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :